Monday, June 2, 2008

కిం కర్తవ్యం...?

కె.సి.ఆర్.ఉప ఎన్నికల పాచిక కాస్తా బెడిసింది.ప్రజలు మంచి తీర్పునే ఇచ్చారు.కె సి ఆర్ కు గుణపాఠం ఇచ్చారు.సాధారణ ఎన్నికలు మరొ సంవత్సర కాలం మాత్రమే వ్యవధి ఉంది.ప్రస్తుత ఆ పార్టీ వ్యుహ రచన పై భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ గుణ పాఠం లా భావించి, ఇకనైనా ప్రజా సమస్యలపై ద్రుష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు.కాని కె సి ఆర్ మాత్రం ఆషాక్ నుంచి తేరుకుంటున్నట్టుగా లేరు.తెలంగాణా వాదులను కలుపుకొని ముందుకెల్లలా?ఒంటరిగా పొరాడాలా?అనే మీమాంసలో ఉన్నరు.ఇప్పటి వరకు తిట్టిన వారితో భవిష్యత్ లో ఎలా మెలగాలి?తెలంగాణ వచ్చుడో?సచ్చుడో?ఈ ఎన్నికల్లో తేలుద్దని ప్రకటించిన మాటలకు సమాధానం...?ఇలా అనేక సంధేహాల్లో కె సి ఆర్ మునిగారు.