Monday, December 29, 2008

Monday, June 2, 2008

కిం కర్తవ్యం...?

కె.సి.ఆర్.ఉప ఎన్నికల పాచిక కాస్తా బెడిసింది.ప్రజలు మంచి తీర్పునే ఇచ్చారు.కె సి ఆర్ కు గుణపాఠం ఇచ్చారు.సాధారణ ఎన్నికలు మరొ సంవత్సర కాలం మాత్రమే వ్యవధి ఉంది.ప్రస్తుత ఆ పార్టీ వ్యుహ రచన పై భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ గుణ పాఠం లా భావించి, ఇకనైనా ప్రజా సమస్యలపై ద్రుష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు.కాని కె సి ఆర్ మాత్రం ఆషాక్ నుంచి తేరుకుంటున్నట్టుగా లేరు.తెలంగాణా వాదులను కలుపుకొని ముందుకెల్లలా?ఒంటరిగా పొరాడాలా?అనే మీమాంసలో ఉన్నరు.ఇప్పటి వరకు తిట్టిన వారితో భవిష్యత్ లో ఎలా మెలగాలి?తెలంగాణ వచ్చుడో?సచ్చుడో?ఈ ఎన్నికల్లో తేలుద్దని ప్రకటించిన మాటలకు సమాధానం...?ఇలా అనేక సంధేహాల్లో కె సి ఆర్ మునిగారు.

Thursday, April 17, 2008

ప్రతిపక్షాలకు నో చాన్స్!

నిత్యవసరాల ధరల పెరుగుదలపై ప్రతిపక్ష,విపక్ష నిరసన ధ్వనులు పెంచేలోగానే సి.ఎం. వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.ధరల పెరుగుదలపై ఇప్పటి వరకు సీరియస్ గా తీసుకోని ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఆ క్రెడిట్ దక్కకుడదనే ఉద్ద్యేషం లొ ఉన్నట్లు తెలుస్తుంది.అందుకు మంత్రులను సమాయాత్తపరుస్తున్నారు.నియంత్రణకు నివేదిక తెప్పిస్తున్నారు.ఉప ఎన్నికల్లో ప్రధానంగా నిత్యవసర సరకులనే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షాలు ఎంచుకునే అవకాశం ఉంది.తమ ప్రభుత్వం పై ప్రజల మనోభావాలను,వ్యతిరేఖతను ఇంటలీజెన్స్ వర్గాల ద్వార తెలుసుకుంటూ ,ఈ ఉప ఎన్నికల్లో వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి,తమకు తిరుగుండదని నిరుపించుకోవాలనే కుతూహులం తో ఉన్నట్లు తెలుస్తుంది.

Thursday, April 3, 2008

మీ మనసులోని ఓ ఆలోచన -ఎందరికో మేలుకొలుపు!

మీ మనసులోని ఓ ఆలోచన ఎందరికో మేలుకొలుపు .ఇంకేముంది...మీఆలోచన ను మాతో పంచుకోండి.
న్యాయపరమైన సమస్యలు,హక్కులు ,మీ ముందు జరుగుచున్న పలు సంఘటణలు,ఏవై నా అవి మా" janam naadi" పక్ష పత్రిక సాధ్యమైనంత వరకు సంబందిత అదికారుల,ప్రజాప్రతినిదుల ద్రుష్టి కి తీసుక వెలుతుంది.పరిష్కారానికి మార్గాలు అన్వేశిస్తుంది.మీ అమూల్యమైన వ్యాసాలు,సామాజిక అంశాలు,ఇంకేమైనా సమస్యలు మాకు తెలియజేయండి.

Sunday, March 30, 2008

రిలియెన్స్ సెల్ దమాకా!501 రు.లకే ఫొన్?గ్రామాల్లో పుకార్లు!

రిలియెన్స్ సంస్థ ఫొన్ వినియోగ దారులను ఆకట్టుకుంటుంది.ఇది వరకే పలు ఆఫర్లను ప్రకటించింది.ఇపుడు మరో క్రొత్త ఆఫర్ ను ప్రకటించిoదనే పుకార్లు గ్రమాల్లో వినిపిస్తున్నాయి.501 రుపాయలకే కలర్ ఫొన్ అని రిలియెన్స్ దుకాణాదారులు కొదరు గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసారు.సంస్థ ఇప్పటి వరకు ప్రకటన జారీ చేయక పోవడం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Tuesday, March 25, 2008

రాజకీయ చదరంగం లో పావులు చేనేతలు!రుణ మాఫీ లొ కార్మికుడికి ఒరిగేదెంతా?

ఓటు రాజకీయం కోసం కొందరు చేనేతలను పావులు గావాడుకుంటున్నారు.రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు.సుమారు 2లక్షల సహాకార రంగకార్మికుల్లొ ఎంత మందికి ప్రయొజనం చేకూరుతుందో సెలవివ్వలేదు.చేనేత సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా సహాకార బ్యాంకులు ఎంత వాడుకుంటె అంతవరకు అప్పు గా రుణ సౌకర్యం కల్పిస్తారు.కార్మికులకు సక్రమంగా కూల్లు చెల్లించేందుకు,అప్పుడప్పుడు నూలు రసాయణాలు కొనుగోలు చేసుకునేందుకు ఈ తాత్కాలిక రుణం ఉపయోగ పడుతుందనె ఉద్ద్యేశం.కాని చాలా చేనేత సంఘాల నాయకులు వాటిని స్వహా చేశారు.వారి పై చర్యలు మాత్రం తీసుకోలేదు.సంబదిత శాఖా అధికారుల పాత్ర పై అనుమానాలున్నాయి.సహజసిద్దంగా నస్టపోయిన సంఘాలు కొన్ని మాత్రమే.ఒక్క కరీం నగర్ జిల్లా విషయానికి వస్తే 750లక్షలు సహాకార బ్యాంకులో బకాయిలు కాగా,మరో 4 కోట్లు ప్రస్తుతం ఉన్న అప్పు.ఈ అప్పు లో కార్మికులకు ఎలాంటి వ్యక్తి గత బాగస్వామ్యం లేదు.జిల్లా లో 11.50 కోట్ల రుపాయల అప్పు లో ప్రస్తుతం మిగిలి ఉన్న ఆస్తులు 1.50 కోట్లకు మించదు.మిగిలినవి లెక్కల్లో మాత్రం ఉంటాయి.ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 కోట్లకు పైగా నే.ఇక కార్మికుడి దినసరి కూలి 60 రుపాయలు.దినమంతా మగ్గం తో వస్త్రం ఉత్పత్తి చేసినా కుటుంబం గడవని దీన స్తితి. ప్రభుత్వం మాఫీ చేసె రుణాల వల్ల చేనేత కార్మికుల స్తితి గతులు మారుతాయా?నేతన్న ఆర్థికాభివ్రుద్ది చెందుతాడా? చేనేతలకు కనీస వేతనాలకై ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలు ,చర్యలు ఏవి? వేతన సంగం గాని,ప్రభుత్వ కార్మిక శాఖాధికారులు గాని ఎమైన ప్రయత్నాలు చేస్థున్నారా? చేనేత కార్మికుడు ఉథ్పత్తి చేసిన వస్రం ఆప్కో నుంచి65 శాతం రేటు పెరిగి ప్రభుత్వానికి సప్లై అవుతుంది.ఆ 65 శాతం కార్మికునికి చెందెవిదంగా చర్యలు చేపట్ట వలసిన అవసరం ఎంతైనా ఉంది.

Thursday, March 20, 2008

పేదోడికి "గూడు" ఇందిరమ్మ పథకం లొ సాధ్యమా..?

పేదవారికి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.కేవలం 40వేల రు.లబ్దిదారునికి బ్యాంకుద్వార ఋణ సౌకర్యం కల్పిస్తున్నారు.నిర్మాణపు ముడిసరకుల ధరలు ఆకాశాన్నంటాయి.ముఖ్యంగా సిమెంట్,ఇటుక,ఐరన్ ధరలు చెప్పనవసరంలేదు.ఎంత తక్కువ ఖర్చు చేసినా లక్ష రుపాయలకు మించే. ఇక మంజూరు విషయానికి వస్తె క్షేత్ర స్తాయి ప్రజాప్రతినిధులకు,అదికారులకు మొదలుకొని జిల్లా స్థాయి వరకు చేతులు తడపందే పని జరగదు.ఈ నేపధ్యం లొ రోజు కోలి,2000 రుపాయలు వేతనం పొందేవారు,పూట గడవని కడుపేద,మధ్య తరగతి వారికి ఈపథకం ద్వారా లబ్ది పొందడం సాద్యమా..?ప్రభుత్వం అక్షలాది మందికి ఇల్లు నిర్మిస్తున్నామంటుంది.వారు ఆర్థికంగా ఉన్నవారా?లేక కడు పేదలా?....మీరేమంటారు?

మిత్రులకు,శ్రేయోబిలాషులకు హొలీ శుభాకాంక్షలు

Sunday, March 16, 2008

నేతన్నలకు పరిహార మే పరిష్కారమా??..మీడియా పాత్ర ఎంతా...?


సిరిసిల్లా కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలకు శాశ్వతపరిష్కార దిశగా ప్రభుత్వం ఆలోచించక పోవడం విచారకరం.ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత పరిహారవిశయంలొ మీడియా చూపిస్తున్న శ్రద్ద,ఆత్మహత్యలుచేసుకోకముందు చూపిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడెవి.బాదిత కథనాలను,వారిబాధలను పత్రికాముఖంగ తెలియజేస్తూ ,అదికారుల వివరణాలను కూడా ప్రచురించడం ద్వారా మంచి స్పందన వస్తుంది.సిరిల్లా లొ కలిచి వేసిన సంఘటనమీముందు ఉంచుతాను.ఓ కుటుంబంలొ తల్లి అంధురాలు,తండ్రి మద్యంవ్యసనం తోఅనారోగ్యం,ఉన్న ఒక్క కొడుకు బాల కార్మికుడు.వై పనిద్వార అంతో ఇంతోపొషన గడిచేది.కొద్ది రోజులతర్వాత ఆబాబు కూడా మధానికి బానిసై అనారోగ్యంతొ మరణించాడు.ఆకుటుంబ పొశన గడిచేది ఎట్ల?వారి రొధణ అరన్యరదనెన.ఈలాంటి సంగటలు ఆప్రాంతంలొ కొ కొల్లలు.ఇక్కడ చెప్పెదెంటంటే బాలుడుపని చేయవద్దేదికాదు.అంతకటె ముఖ్యం చదువు.చెడువ్యసనాలనుంచిదూరంగా ఉంచేందుకు చైతన్యం అవసరం.................................

Friday, March 14, 2008

జనాకర్షన పథకాలు సెంటిమెంటును తగ్గించనుందా?


వై.ఏస్ ప్రభుత్వం ప్రవేషపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు,సాగునీటిప్రాజెక్టులు,పెన్షన్లు,ముఖ్యంగా అమలుకాబొయెరెండు రుపాయలకే కిలో బియ్యం పథకాలే కాకుండ కేంద్రం ఇటీవల ప్రకటించిన రైతు రుణాల మాఫీ లు ఉపఎన్నికలపై ఏమాత్రంప్రభావం చూపుతావనేవి రాజకీయ పరిశీలకుల్లో ఆలొచనలు రేకెత్తిస్థున్నాయి.టి.ఆర్.ఏస్.తెలంగానా సెంటిమెంట్ తోపాటుఆంద్ర అభివ్రుద్ది,తెలంగానాకు వాటాల్లో అన్యాయాన్ని ఎండగడుతుంది.ఈదశలొ సనివారం రోజున కే.సి.ఆర్.కరీం నగర్ జిల్లా లొ భహిరంగ సభా వేదికగా ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్బం లొ మీస్పందన?.............................

Tuesday, March 4, 2008

డైలమాలో కాంగ్రెస్, టి.డి.పి.

తెలంగాణ ఎం.ఎల్.ఎ., ఎం.పి.లు రాజినామె చెసిన నెపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ 5 జిల్లాల్లో ప్రభావం చూపెట్టనుంది. కె.సి.ర్., దుం-ధాం కలాకారులు గ్రామాల్లో మకాం వెసి ప్రజలను మరింత రెచ్చగొట్టె ప్రమాదం వుంది. తెలంగాణలో కరీం నగర్, నిజామబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలలో ప్రభావం చుపెట్టనుంది. వై.ఎస్. అభివ్రుద్ది మంత్రం ఈ జిల్లాల్లో ప్రభావం చుపెట్టక పోవచ్చు. ఈ ప్రాంత తి.డి.పి., కాంగ్రెస్స్ నేతలు ఈ ప్రాంత వాసులకు ఎం చెప్పాలో తెలియక దైలమాలొ పడ్డారు. తెలంగాన మంత్రులు ఆయ జిల్లాల్లొ పర్యటిస్తె ప్రజలు నిలదీసె అవకాషం వుంది. వారి నుంది సరి ఇన సమాదానం దొరికె అవకాషలు లెవు. రానున్న యెలెక్షన్లలొ వొటు బ్యాంక్ పై ప్రభావం చూపెట్టనుంది

Monday, February 25, 2008

టి.అర్.ఎస్. ఎం.ఎల్.ఏ.ల రాజీనామా అవసరమా?

గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజ ప్రథినిదులుగా ప్రజలకు చెసిన సేవ, చట్ట సభల్లొ ప్రజల సమస్యలపై ఎంత వరకు చర్చించారో మననం చెసుకొవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రత్యెక రాస్త్రం అవసరమె ఐనా అబివ్రుద్దిని సమస్యలను విస్మరిచడం సరి కాదనెది సత్యం. రాష్త్ర అసెంబ్లి సమావేష కాలాన్ని వ్రుదా చెయదం పై ప్రజల్లొ తప్పుడు సంకెతాలు వెలువడు తున్నాయీ. అబివ్రుద్దిని ప్రజ సంస్యలను ద్రుస్తిలొ వుంచుకొని ప్రత్యెక రాష్త్రాని కై రాజినామా ప్రయత్నాలను విరమించుకొవాలనె అభిప్రాయం ప్రజల్లొ వుంది.

Thursday, January 24, 2008

JANAMNAADI

  • WHAT IS UR OPINION ON TELANGANA SENTIMENT?
  • WHAT IS UR OPINION ON THIS UPA GOVERMENT?
  • WHAT IS UR OPINION ON GOVT. DEVELOPMENT ACTIVITIES?