Tuesday, March 25, 2008

రాజకీయ చదరంగం లో పావులు చేనేతలు!రుణ మాఫీ లొ కార్మికుడికి ఒరిగేదెంతా?

ఓటు రాజకీయం కోసం కొందరు చేనేతలను పావులు గావాడుకుంటున్నారు.రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు.సుమారు 2లక్షల సహాకార రంగకార్మికుల్లొ ఎంత మందికి ప్రయొజనం చేకూరుతుందో సెలవివ్వలేదు.చేనేత సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా సహాకార బ్యాంకులు ఎంత వాడుకుంటె అంతవరకు అప్పు గా రుణ సౌకర్యం కల్పిస్తారు.కార్మికులకు సక్రమంగా కూల్లు చెల్లించేందుకు,అప్పుడప్పుడు నూలు రసాయణాలు కొనుగోలు చేసుకునేందుకు ఈ తాత్కాలిక రుణం ఉపయోగ పడుతుందనె ఉద్ద్యేశం.కాని చాలా చేనేత సంఘాల నాయకులు వాటిని స్వహా చేశారు.వారి పై చర్యలు మాత్రం తీసుకోలేదు.సంబదిత శాఖా అధికారుల పాత్ర పై అనుమానాలున్నాయి.సహజసిద్దంగా నస్టపోయిన సంఘాలు కొన్ని మాత్రమే.ఒక్క కరీం నగర్ జిల్లా విషయానికి వస్తే 750లక్షలు సహాకార బ్యాంకులో బకాయిలు కాగా,మరో 4 కోట్లు ప్రస్తుతం ఉన్న అప్పు.ఈ అప్పు లో కార్మికులకు ఎలాంటి వ్యక్తి గత బాగస్వామ్యం లేదు.జిల్లా లో 11.50 కోట్ల రుపాయల అప్పు లో ప్రస్తుతం మిగిలి ఉన్న ఆస్తులు 1.50 కోట్లకు మించదు.మిగిలినవి లెక్కల్లో మాత్రం ఉంటాయి.ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 కోట్లకు పైగా నే.ఇక కార్మికుడి దినసరి కూలి 60 రుపాయలు.దినమంతా మగ్గం తో వస్త్రం ఉత్పత్తి చేసినా కుటుంబం గడవని దీన స్తితి. ప్రభుత్వం మాఫీ చేసె రుణాల వల్ల చేనేత కార్మికుల స్తితి గతులు మారుతాయా?నేతన్న ఆర్థికాభివ్రుద్ది చెందుతాడా? చేనేతలకు కనీస వేతనాలకై ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలు ,చర్యలు ఏవి? వేతన సంగం గాని,ప్రభుత్వ కార్మిక శాఖాధికారులు గాని ఎమైన ప్రయత్నాలు చేస్థున్నారా? చేనేత కార్మికుడు ఉథ్పత్తి చేసిన వస్రం ఆప్కో నుంచి65 శాతం రేటు పెరిగి ప్రభుత్వానికి సప్లై అవుతుంది.ఆ 65 శాతం కార్మికునికి చెందెవిదంగా చర్యలు చేపట్ట వలసిన అవసరం ఎంతైనా ఉంది.

1 comment:

vema said...

such a wonderful and Great information