Thursday, March 20, 2008

పేదోడికి "గూడు" ఇందిరమ్మ పథకం లొ సాధ్యమా..?

పేదవారికి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.కేవలం 40వేల రు.లబ్దిదారునికి బ్యాంకుద్వార ఋణ సౌకర్యం కల్పిస్తున్నారు.నిర్మాణపు ముడిసరకుల ధరలు ఆకాశాన్నంటాయి.ముఖ్యంగా సిమెంట్,ఇటుక,ఐరన్ ధరలు చెప్పనవసరంలేదు.ఎంత తక్కువ ఖర్చు చేసినా లక్ష రుపాయలకు మించే. ఇక మంజూరు విషయానికి వస్తె క్షేత్ర స్తాయి ప్రజాప్రతినిధులకు,అదికారులకు మొదలుకొని జిల్లా స్థాయి వరకు చేతులు తడపందే పని జరగదు.ఈ నేపధ్యం లొ రోజు కోలి,2000 రుపాయలు వేతనం పొందేవారు,పూట గడవని కడుపేద,మధ్య తరగతి వారికి ఈపథకం ద్వారా లబ్ది పొందడం సాద్యమా..?ప్రభుత్వం అక్షలాది మందికి ఇల్లు నిర్మిస్తున్నామంటుంది.వారు ఆర్థికంగా ఉన్నవారా?లేక కడు పేదలా?....మీరేమంటారు?

No comments: